ఆరుగొలనుపేట పాఠశాలలో వార్షిక తనిఖీ రికార్డులు పరిశీలించిన మండల విద్యాశాఖ అధికారి
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం ఆరుగొలనుపేట ఎంపీయూపీ పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి–1 మాసగిరి శ్రీనివాస్ సోమవారం వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న వివిధ రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బంది, విద్యార్థుల హాజరు పట్టికలు, ఉపాధ్యాయుల రికార్డులు, విద్యార్థుల ప్రగతి పత్రాలు, ఎఫ్‌ఏ–1కు సంబంధించిన రాత ప్రతులు తదితర రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు.
విద్యార్థుల హాజరు శాతాన్ని మరింత పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. బడిబయట విద్యార్థులు ఎవరూ ఉండకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. పాఠశాలలో అందించే మధ్యాహ్న భోజనం రుచికరంగా, పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పాఠశాల నిర్వహణలో పాఠశాల నిర్వహణ కమిటీ ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులు, సిబ్బందిపై ఉందని మాసగిరి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విధుల్లో సమయపాలన పాటిస్తూ విద్యార్థుల విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రు, పాఠశాల సిబ్బంది, సీఆర్‌ఎంటీ రమేష్ పాల్గొన్నారు.