కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
NTODAY NEWS: జగిత్యాల జిల్లా
బుగ్గారం మండలం సిరికొండ గ్రామంలో నూతనంగా ఎన్నికైన ఇండిపెండెంట్ సర్పంచ్ ధర్మరాజు, గ్రామస్తులు, యువత పెద్ద ఎత్తున రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు పార్టీకండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజల నమ్మకంతో గెలిచిన సర్పంచ్ ధర్మరాజు కాంగ్రెస్ పార్టీలో చేరడం హర్షణీయమని అన్నారు. సిరికొండ గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొని గ్రామాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.














