మార్కాపురం జిల్లాలో 11 వైన్ షాపులకు మరోసారి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
మార్కాపురం:
మార్కాపురం జిల్లాలో 11 వైన్ షాపుల కేటాయింపునకు మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎస్.కె. ఆయేషా బేగం తెలిపారు. మార్కాపురం, గిద్దలూరు, కంభం, పొదిలి, కనిగిరి ప్రాంతాల్లో లాటరీ విధానం ద్వారా వైన్ షాపులను కేటాయించనున్నట్లు వెల్లడించారు.
ఆసక్తి ఉన్నవారు ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 21వ తేదీన లాటరీ ప్రక్రియ నిర్వహించి వైన్ షాపులను కేటాయించనున్నట్లు తెలిపారు.
అర్హత కలిగిన దరఖాస్తుదారులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులు సూచించారు.