BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 13 October 2026, 10:37 am
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
13 Oct, 2026 - 10:37 AM
2 వీక్షణలు

ఆత్రేయపురంలో 148వ మానవత శాఖ ప్రారంభం

నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్ర అధ్యక్షుడు

ఆత్రేయపురం: మనిషికి ఉన్నంతకాలం మంచి పనులు చేస్తూ సమాజానికి సేవ చేయాలని రాష్ట్ర మానవత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు ఎన్. రామచంద్రారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ఆత్రేయపురంలో మానవత సంస్థ 148వ శాఖను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆత్రేయపురంలోని అల్లూరి సీతారామరాజు సెంటర్‌లో మంతెన ఆనందరాజు అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భగవంతుడు ప్రసాదించిన వివేకాన్ని కోల్పోకుండా, అహంకారానికి దూరంగా ఉంటూ వినయంతో జీవించాలని సూచించారు. సేవా భావంతో ఇతరులకు సహాయం చేయడం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని పేర్కొన్నారు.

నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

ఆత్రేయపురం మానవత శాఖ నూతన అధ్యక్షుడిగా నియమితులైన దండు వెంకటసుబ్బరాజు, కార్యదర్శి వేగేశ్న శ్రీనివాసరాజుతోపాటు ముదునూరి సోమరాజు, పులవర్తి నాగేశ్వరరావు, పేరూరి నాగేశ్వరరావు, గల్లి వెంకటేశ్వరరావులతో రామచంద్రారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, స్థానిక శాఖ అధ్యక్షుడు దండు వెంకటసుబ్బరాజు, నూతన కార్యవర్గ సభ్యులను వైఎస్సార్‌సీపీ నాయకుడు గొట్టుముక్కల గోపిరాజు, మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బండ కృష్ణంరాజు పూలమాలలు వేసి సన్మానించారు.

మానవత సేవలపై ప్రసంగం

కార్యక్రమంలో సంస్థ స్థానిక కో-ఆర్డినేటర్ గాదిరాజు ప్రసాదరాజు, సెంట్రల్ కమిటీ నాయకులు కోడూరి రాధా పుష్పావతి, రామలక్ష్మి, చిట్టూరి సుజాత తదితరులు పాల్గొని మానవత సంస్థ లక్ష్యాలు, సేవా కార్యక్రమాల ఆవశ్యకతను వివరించారు.