BREAKING
ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సంగారెడ్డి: అధ్యాపక పోస్టులకు దరఖాస్తు రేపే ఆఖరి తేదీ! సంగారెడ్డి: రూ.500 కోసం తండ్రి గొంతు కోసిన కొడుకు నోయెల్ టాటా త్వరలో ఆర్‌బిఐతో టాటా సన్స్ హోదా గురించి చర్చించవచ్చు బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద అక్రమ బియ్యం పట్టివేత ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సంగారెడ్డి: అధ్యాపక పోస్టులకు దరఖాస్తు రేపే ఆఖరి తేదీ! సంగారెడ్డి: రూ.500 కోసం తండ్రి గొంతు కోసిన కొడుకు నోయెల్ టాటా త్వరలో ఆర్‌బిఐతో టాటా సన్స్ హోదా గురించి చర్చించవచ్చు బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద అక్రమ బియ్యం పట్టివేత
www.ntodaynews.com

​పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ చేపట్టాలి

తెలంగాణ
/ నల్గొండ / నకిరేకల్
20 Aug, 2026 - 08:13 PM
14 వీక్షణలు

​​పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ చేపట్టాలి : ఎమ్మెల్యే వేముల వీరేశం   

నకిరేకల్‌లో సర్ రెండో విడత ప్రక్రియపై శిక్షణ


నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని నారాయణ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో నకిరేకల్ నియోజకవర్గ స్థాయి సర్ రెండో విడత ప్రక్రియపై శిక్షణ  కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. శిక్షణలో భాగంగా సర్ రెండో విడతలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఓటర్ల జాబితా పరిశీలన, ఓటర్ల వివరాల సేకరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఓటరుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సర్ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హత కలిగిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించే దిశగా అధికారులు, బి ఎల్ వో లు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఈ.ఆర్. ఓ లెవల్ కోఆర్డినేటర్ చామల శ్రీనివాస్, సీనియర్ నాయకులు పూజర్ల శంభయ్య, నియోజకవర్గ పరిధిలోని. బి ఎల్ వో లు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు