BREAKING
thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త
Date of Publish : 05 October 2026, 08:30 am
Posted by : ADARI RAMA PRASAD

పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
05 Oct, 2026 - 08:30 AM
6 వీక్షణలు

ఎలమంచిలి: అనారోగ్యం, వైద్య ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని టీడీపీ నాయకులు తెలిపారు. ఎలమంచిలి నియోజకవర్గంలో పాటిపల్లి గ్రామానికి చెందిన గనిరెడ్డి సత్యవతి, సత్యనారాయణ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ.65 వేల చెక్కును అందజేశారు.

ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పప్పుల చలపతిరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులకు చెక్కును అందజేసి, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందినట్లు తెలిపారు.

వైద్య చికిత్సకు అధికంగా ఖర్చు కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా అందే ఆర్థిక సహాయం కొంత మేర ఉపశమనం కలిగిస్తుందని నాయకులు పేర్కొన్నారు. అర్హులైన పేద కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ భీమరశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర యాదవ సంఘం డైరెక్టర్ దూసి రంగనాయకులు, అచ్చుతాపురం మండల పార్టీ అధ్యక్షుడు తులసీరామ్, పాటిపల్లి టీడీపీ యూనిట్ ఇన్‌చార్జి ఆదారి జగన్నాధరావు, మునగపాక గ్రామ శాఖ అధ్యక్షుడు దాడి శివ, తిమ్మరాజుపేట గ్రామ శాఖ అధ్యక్షుడు బీటీ రమణ, జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మల్ల వరాహ నరసింహారావు, మండల టీడీపీ అధ్యక్షుడు మల్ల శేషు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.