BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు
Test 4
Date of Publish : 19 November 2026, 05:01 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎన్నికల విధుల్లో సేవలందించిన ఎన్‌ఎస్ఎస్ విద్యార్థులకు ప్రశంసాపత్రాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 05:01 AM
22 వీక్షణలు

యువత సేవాభావంతో సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి: మహిళా ఎస్ఐ వల్లి పద్మ

జంగారెడ్డిగూడెం: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా పోలీస్ శాఖకు సహాయకులుగా ఎన్‌ఎస్ఎస్ వాలంటీర్లుగా సేవలందించిన ప్రభుత్వ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎన్నికల విధుల్లో విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బాధ్యతాయుతంగా సేవలందించడాన్ని గుర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు, జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచనలతో, జంగారెడ్డిగూడెం సీఐ ఎం.వి. సుభాష్ ఆధ్వర్యంలో తడికలపూడి మహిళా ఎస్ఐ వల్లి పద్మ కళాశాల యాజమాన్యంతో కలిసి విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్ఐ వల్లి పద్మ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ విలువైన సేవలను అందించడం అభినందనీయమని అన్నారు. యువతలో సేవాభావం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెంపొందించాలని, చదువుతో పాటు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు.

వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకునే సమయంలో అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో యువత ముందుండాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు విద్యార్థులు అందించిన సహకారం ఎంతో విలువైనదని పేర్కొన్నారు.

భవిష్యత్తులోనూ పోలీస్ శాఖ నిర్వహించే ప్రజా అవగాహన కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. అనంతరం ఎన్నికల విధుల్లో బాధ్యతాయుతంగా సేవలందించిన ఎన్‌ఎస్ఎస్ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందిం

చారు.