BREAKING
thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్ thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్
Test 4
Date of Publish : 18 November 2026, 08:49 pm
Posted by : K MAHESH

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం

తెలంగాణ
/ వరంగల్
Reporter
K Mahesh Munugodu Constituency
18 Nov, 2026 - 08:49 PM
13 వీక్షణలు

నర్సంపేట, నవంబర్ 18 (ఎన్ టుడే న్యూస్): ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు మార్గదర్శకాలపై సంబంధిత అధికారులు, సిబ్బందికి నర్సంపేట మండల పరిషత్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పథకం అమలుకు సంబంధించిన పలు అంశాలను వివరించారు.

శిబిరాల నిర్వహణ, వాటి పరిధి, సిబ్బంది సంసిద్ధత, ప్రజలకు పథకంపై అవగాహన కల్పించడం, అర్హులైన లబ్ధిదారుల నమోదు, రికార్డుల భద్రత, ఫిర్యాదుల పరిష్కారం, క్లెయిమ్‌ల ప్రక్రియలను ఎప్పటికప్పుడు సమీక్షించడం వంటి అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.

ప్రతి అర్హ కుటుంబానికి పథకంలో సులభంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని, నమోదు సమయంలో ఎదురయ్యే సమస్యలు, ఆటంకాలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. అవసరమైతే సమస్యలను మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, క్లస్టర్ విధులకు కేటాయించిన ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, సీఏలు, ఇతర సంబంధిత సిబ్బందితో పాటు ఎంపీఓ పాల్గొన్నారు. ప్రజలకు పథకం ప్రయోజనాలు అందేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అధికారులు సూచించారు.