BREAKING
thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్ thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్
Test 4
Date of Publish : 18 November 2026, 08:44 pm
Posted by : K MAHESH

గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
18 Nov, 2026 - 08:44 PM
13 వీక్షణలు

ఎమ్మెల్యే కోరం కనకయ్యకు సీపీఎం నాయకులు, రైతుల వినతి

గార్ల, నవంబర్ 18: గార్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులకు తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కందునూరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మండల కేంద్రంలో చేయూత పథకం కింద నూతన పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే కోరం కనకయ్యకు సీపీఎం ఆధ్వర్యంలో రైతులతో కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కందునూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి, పత్తి, వరి సాగు చేసిన రైతులకు కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. అప్పులు చేసి వ్యవసాయం చేసిన రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

గార్ల మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించి రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని, కొత్త రుణాలు అందించాలని కోరారు. వ్యవసాయ కూలీలకు ప్రకటించిన ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయాన్ని తక్షణమే అందించాలని, ఉపాధి హామీ పనిదినాలను పెంచడంతో పాటు కూలీలకు కనీస వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

ఏజెన్సీ ప్రాంతమైన గార్ల మండలంలోని రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. ఈ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మండలానికి తగిన న్యాయం జరిగేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు, రైతులు వి. వెంకటేశ్వర్లు, కె. రామకృష్ణ, టి. నాగేశ్వరరావు, వార్డు సభ్యుడు లక్ష్మిశెట్టి పూర్ణచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.