BREAKING
thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్ thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్
Test 4
Date of Publish : 18 November 2026, 08:51 pm
Posted by : K MAHESH

ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
18 Nov, 2026 - 08:51 PM
11 వీక్షణలు

ఖానాపూర్, నవంబర్ 18 (ఎన్ టుడే న్యూస్): ఖానాపూర్ మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో బుధవారం గణాంక శాఖ ఆధ్వర్యంలో వరి పంట కోత ప్రయోగం నిర్వహించారు. వరంగల్ ముఖ్య ప్రణాళికాధికారి (సీపీఓ) పి. చంద్రకళ పర్యవేక్షణలో ఈ ప్రయోగం చేపట్టారు.

గ్రామానికి చెందిన రైతు రాజబోయిన సమ్మయ్య సాగు చేసిన KNM-7715 రకం వరి పంటలో 5 × 5 మీటర్ల విస్తీర్ణంలో, అంటే 25 చదరపు మీటర్లలో పంట కోత చేపట్టారు. ఈ ప్రయోగంలో 15.270 కిలోల ధాన్యం దిగుబడి నమోదైంది. ఈ దిగుబడి ఆధారంగా ఎకరాకు సుమారు 24.43 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎన్. రమేష్, నర్సంపేట డివిజన్ డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ సీహెచ్. విజేందర్, మండల ప్రణాళిక మరియు గణాంక అధికారి (ఎంపీఎస్ఓ) సుగుణ, గ్రామ పరిపాలన అధికారి (వీఆర్ఓ) పి. రమేష్ పాల్గొన్నారు.