BREAKING
thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్ thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్
Test 4
Date of Publish : 18 November 2026, 09:08 pm
Posted by : K MAHESH

బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
K Mahesh Munugodu Constituency
18 Nov, 2026 - 09:08 PM
12 వీక్షణలు

పాఠశాలలు, కళాశాలల్లో బాలబాలికలకు రక్షణ కల్పించాలి: కొడారి వెంకటేష్

వలిగొండ, నవంబర్ 18 (ఎన్ టుడే న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో బాలబాలికలకు రక్షణ, సంరక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తూ, వారి హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక (సీఆర్‌పీఎఫ్) జిల్లా నాయకుడు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తగిన రక్షణ, సంరక్షణ అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన ఉద్యోగులు, సిబ్బంది విధులను విస్మరించి ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల రక్షణ కోసం యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు (వీసీపీసీలు) కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయని, ఉన్నచోట్ల కూడా నామమాత్రంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

బాలల హక్కుల పరిరక్షణ కోసం జిల్లా స్థాయిలో చైల్డ్‌లైన్, జిల్లా బాలల సంరక్షణ విభాగం (డీసీపీయూ), స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్ (ఎస్‌జేపీయూ), చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ), జువైనల్ జస్టిస్ బోర్డు (జేజేబీ), జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) వంటి వ్యవస్థలు పనిచేస్తున్నాయని తెలిపారు. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు కూడా బాలల సంక్షేమానికి కృషి చేయాల్సి ఉందన్నారు. రాష్ట్ర స్థాయిలో స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎస్‌సీపీసీఆర్), జాతీయ స్థాయిలో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సీపీసీఆర్) ఉన్నాయని వివరించారు.

కస్తూర్బా గాంధీ పాఠశాలలు, కళాశాలలకు గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు (జీసీడీవోలు), గురుకుల విద్యాసంస్థలకు రీజనల్ కో-ఆర్డినేటర్లు (ఆర్‌సీవోలు), జిల్లా కో-ఆర్డినేటర్లు (డీసీవోలు), జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈవోలు) నియమితులయ్యారని తెలిపారు. వీరంతా విద్యార్థులకు రక్షణ, సంరక్షణతో పాటు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, శారీరక వ్యాయామం, క్రీడలు, మానసిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు కౌన్సెలింగ్ అందేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. అయితే, ఆయా సంస్థలకు చెందిన కొందరు అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బాలల హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు.

బాలల హక్కులకు భంగం కలిగినప్పుడు పిల్లలు 100, 1098 లేదా 112 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని వెంకటేష్ కోరారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్ సిబ్బంది పిల్లలు ఉన్న ప్రదేశానికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించాలని, చట్ట ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి బాధిత పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరచాలని సూచించారు. సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు అవసరమైన పిల్లలకు బాలసదనం లేదా సఖీ కేంద్రంలో ఆశ్రయం కల్పించాలని తెలిపారు. పిల్లలకు న్యాయ సహాయం అందించడంలో జేజేబీ, డీఎల్‌ఎస్‌ఏలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.