BREAKING
thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్ thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్
Test 4
Date of Publish : 18 November 2026, 09:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండలంలో 11 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Nov, 2026 - 09:35 PM
32 వీక్షణలు

క్వింటా గ్రేడ్‌-ఏ ధాన్యానికి రూ.2,461.. సాధారణ రకానికి రూ.2,441 మద్దతు ధర ధాన్యం విక్రయించిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ ఆర్ఎస్‌కేల ద్వారా మద్దతు ధర పొందాలని రైతులకు వ్యవసాయ శాఖ సూచన చాట్రాయి, నవంబర్ 18: చాట్రాయి మండలంలో ఈ ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన వరి పంటలు కోతకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సూచించారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్‌కే) ద్వారా ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర పొందాలని కోరారు. ఈ ఖరీఫ్ సీజన్‌కు ప్రభుత్వం వరి మద్దతు ధరను గ్రేడ్‌-ఏ రకానికి క్వింటాకు రూ.2,461గా, సాధారణ రకం ధాన్యానికి రూ.2,441గా నిర్ణయించింది. రైతులు కోసిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో ఆరబెట్టి, సమీపంలోని రైతు సేవా కేంద్రం వద్ద తేమ శాతాన్ని పరీక్షించుకోవాలని అధికారులు సూచించారు. ధాన్యంలో తేమ శాతం 17 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు తరలించాలని తెలిపారు. చాట్రాయి మండల పరిధిలోని బూరుగుగూడెం, చనుబండ, చాట్రాయి, చీపురుగూడెం, చిన్నంపేట, ఆరుగొలనుపేట, మర్లపాలెం, నరసింహారావుపాలెం, పోలవరం, పోతనపల్లి, తుమ్మగూడెం గ్రామాల్లో మొత్తం 11 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు 24 గంటల్లో వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం చాట్రాయి గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని మండల తహసీల్దార్,బి శ్వేత మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్ సందర్శించారు. ధాన్యంలో తేమ శాతాన్ని పరీక్షించే యంత్రం పనితీరును పరిశీలించారు. రైతుల సమక్షంలోనే మాయిశ్చర్ మీటర్ ద్వారా ధాన్యం తేమ శాతాన్ని పరీక్షించి, కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని అధికారులు సూచించారు

.