BREAKING
thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్ thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్
Test 4
Date of Publish : 18 November 2026, 09:40 pm
Posted by : PAMMI NAVEENKUMAR

40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
Reporter
pammi naveenkumar రావులపాలెం మండల ప్రతినిధి
18 Nov, 2026 - 09:40 PM
14 వీక్షణలు

చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్న మెర్లపాలెం గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షుడు

మెర్లపాలెం (ఎన్ టుడే న్యూస్): మెర్లపాలెం గ్రామానికి చెందిన ఇర్లపాటి నరసయ్య తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాదాపు 40 ఏళ్లుగా టీడీపీతో అనుబంధం కలిగి ఉన్న ఆయన, మాజీ ఎమ్మెల్యే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి నరసయ్యకు పార్టీలోకి స్వాగతం పలికారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

40 ఏళ్ల రాజకీయ అనుబంధాన్ని వీడి నరసయ్య వైఎస్సార్‌సీపీలో చేరడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మెర్లపాలెం గ్రామంలో పార్టీకి పెరుగుతున్న ఆదరణతో ఇతర పార్టీల నాయకులు కూడా వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. రానున్న రోజుల్లో మరింతమంది నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరతారని ఆశాభావం వ్యక్తం చేశాయి.