BREAKING
thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్ thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్
Test 4
Date of Publish : 18 November 2026, 08:46 pm
Posted by : K MAHESH

భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
18 Nov, 2026 - 08:46 PM
12 వీక్షణలు

కార్మికుల సంక్షేమానికే నిధులను వినియోగించాలి: గొరిగే సోములు

రామన్నపేట, నవంబర్ 18: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం వారి నుంచి వసూలు చేస్తున్న సెస్ నిధులను ఇతర సంక్షేమ పథకాలకు మళ్లించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని భవన నిర్మాణ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి గొరిగే సోములు డిమాండ్ చేశారు.

రామన్నపేటలో నిర్వహించిన భవన నిర్మాణ కార్మికుల మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమం కోసం వినియోగించాల్సిన సెస్ నిధులను ఇతర పథకాలకు ఖర్చు చేయడం ద్వారా భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. బీమా కార్యకలాపాలను ట్రయల్ బ్లేజర్ ఆర్గనైజేషన్ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించారని, ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను మళ్లించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

కార్మికుల కష్టార్జితంతో సమకూరిన నిధులను వారి సంక్షేమం, భద్రత, భవిష్యత్తు అవసరాల కోసమే వినియోగించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును బలోపేతం చేయాలని, కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ప్రమాద బీమా, విద్య, వైద్య ప్రయోజనాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.

సెస్ నిధులను ఇతర పథకాలకు మళ్లించే ప్రయత్నాలను ప్రభుత్వం నిలిపివేయాలని, లేనిపక్షంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్మికుల సంక్షేమం కోసం సేకరించిన ప్రతి రూపాయి వారికే ఖర్చు చేయాలని అన్నారు.

ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం, అప్పం సురేందర్, మండల అధ్యక్షుడు వంగాల మారయ్య, కార్యదర్శి బుడ్డ ప్రసాద్, తరిగొప్పుల వెంకట్ రెడ్డి, గొరిగే మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.