BREAKING
thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్ thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్
Test 4
Date of Publish : 18 November 2026, 09:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కామవరపుకోట అభివృద్ధికి కృషి చేసే వారికే పట్టం కట్టండిఎస్‌డీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గుబ్బల నాగేశ్వరరావు పిలుపు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Nov, 2026 - 09:35 PM
15 వీక్షణలు

పార్టీలకు అతీతంగా బరిలో నిలిచిన వీరమల్ల మధుసూదనరావుకు మద్దతు కామవరపుకోట, నవంబర్ 18: గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేసే నాయకులను పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకోవాలని ఏలూరు జిల్లా సామాజిక ప్రజాస్వామ్య ఫ్రంట్ (ఎస్‌డీఎఫ్) జిల్లా అధ్యక్షుడు గుబ్బల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. పదవుల కోసం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసే అభ్యర్థులకు ప్రజలు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బుధవారం కామవరపుకోటలోని స్థానిక సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏ పార్టీతోనూ అనుబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న వీరమల్ల మధుసూదనరావు అభ్యర్థిత్వానికి ఎస్‌డీఎఫ్ తరఫున మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ మధుసూదనరావు ఎలాంటి పదవులు లేకపోయినా గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తిని సర్పంచ్‌గా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి మరింతగా కృషి చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సామాజిక హక్కుల వేదిక కన్వీనర్ షేక్ ఇబ్రహీం మాట్లాడుతూ కామవరపుకోటతో పాటు పరిసర ప్రాంతాల్లో మధుసూదనరావు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఆయనకు ప్రజలు అవకాశం కల్పిస్తే గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మేలు జరిగేలా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సీపీఐ నాయకుడు టీవీఎస్ రాజు మాట్లాడుతూ మధుసూదనరావును గెలిపిస్తే ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పంచాయతీ సుందరీకరణతో పాటు సమగ్ర గ్రామాభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. గ్రామ ప్రజలు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవీంద్రనాథ్, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు

.