BREAKING
thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్ thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్
Test 4
Date of Publish : 18 November 2026, 09:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో ఉత్సాహంగా ప్రారంభమైన ఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Nov, 2026 - 09:36 PM
23 వీక్షణలు

అండర్–14 బాలబాలికల విభాగంలో 440 మంది క్రీడాకారుల ప్రతిభాప్రదర్శన 21 మండలాల నుంచి జట్ల హాజరు.. ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్రస్థాయి పోటీల్లో అవకాశం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని టీవీఎం ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఖమ్మం జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి అండర్–14 బాలబాలికల కబడ్డీ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ మండలాల నుంచి తరలివచ్చిన క్రీడాకారుల సందడితో పోటీల ప్రాంగణం క్రీడా ఉత్సాహాన్ని సంతరించుకుంది. మధిర మండల విద్యాశాఖ అధికారి సీహెచ్. శ్రీహరి అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమానికి మధిర మున్సిపల్ చైర్‌పర్సన్ సుజాత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఎస్‌జీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించి పోటీలకు శ్రీకారం చుట్టారు. అనంతరం టీవీఎం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యజిత్ క్రీడా పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ జిల్లా స్థాయి పోటీల్లో ఖమ్మం జిల్లాలోని 21 మండలాల నుంచి 220 మంది బాలురు, 220 మంది బాలికలు కలిపి మొత్తం 440 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వీరితో పాటు సుమారు 100 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పోటీల నిర్వహణలో భాగస్వాములయ్యారు. బాలబాలికల జట్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఉత్సాహంగా బరిలోకి దిగాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి వై. చిన్ని మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బాలబాలికల జట్లను ఎంపిక చేసి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు పంపించనున్నట్లు వెల్లడించారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణతో పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా నిర్వాహకులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.