BREAKING
thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్ thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్
Test 4
Date of Publish : 18 November 2026, 09:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రమణక్కపేట రిజర్వ్ ఫారెస్ట్‌లో పులి కోసం భారీ ఆపరేషన్ పులిని బంధించేందుకు రంగంలోకి పూణే ప్రత్యేక బృందం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Nov, 2026 - 09:39 PM
78 వీక్షణలు

ఎర ఏర్పాటు చేసి మాటువేసిన అటవీ అధికారులు.. మత్తుమందు ఇచ్చేందుకు సన్నద్ధం జనావాసాల్లోకి రాకుండా పరిసర ప్రాంతాల్లో నిరంతర నిఘా


ఏలూరు జిల్లా: రామన్నక్కపేట రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో సంచరిస్తున్న పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీ శాఖ అధికారులు భారీ స్థాయిలో ఆపరేషన్ చేపట్టారు. బుధవారం (నవంబర్ 18) రోజంతా పులి సంచారం ఇదే ప్రాంతంలో కేంద్రీకృతం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దానిని సురక్షితంగా బంధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పూణే నుంచి ప్రత్యేక బృందం రాక పులిని పట్టుకునేందుకు పూణే నుంచి ప్రత్యేక వన్యప్రాణి రక్షణ, మత్తుమందు ప్రయోగ నిపుణుల బృందం రంగంలోకి దిగింది. ఏలూరు డివిజన్ అటవీ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి ఈ బృందం పులి కదలికలను నిశితంగా పరిశీలిస్తోంది. అనువైన సమయంలో మత్తుమందు ప్రయోగించి పులిని సురక్షితంగా బంధించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఎర ఏర్పాటు.. రహస్యంగా మాటు పులి జనావాసాల వైపు వెళ్లకుండా దాని సంచార ప్రాంతంలోని మామిడి తోట, అటవీ సరిహద్దు వద్ద వ్యూహాత్మకంగా ఎరను ఏర్పాటు చేశారు. పులికి అనుమానం రాకుండా అటవీ శాఖకు చెందిన రక్షణ వాహనాన్ని చెట్ల కొమ్మలు, ఆకులతో కప్పి సహజ వాతావరణంలో కలిసిపోయేలా సిద్ధం చేశారు. చెట్ల నీడలో వాహనాన్ని ఉంచి ప్రత్యేక బృందం మాటువేసింది. పులి ఎర వద్దకు చేరుకున్న వెంటనే మత్తుమందు ప్రయోగించి పట్టుకునేందుకు అవసరమైన పరికరాలతో సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ప్రజల రాకపోకలపై నిఘా ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో అటవీ ప్రాంత పరిసరాల్లోకి సాధారణ ప్రజలు వెళ్లకుండా అధికారులు పర్యవేక్షణ చేపట్టారు. పులి కారణంగా ప్రజలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా, వన్యప్రాణి–మానవ సంఘర్షణ చోటుచేసుకోకుండా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయి బృందాలు అప్రమత్తంగా ఉండి ఎర ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. పులిని సాధ్యమైనంత త్వరగా, ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా బంధించడమే లక్ష్యంగా ఆపరేషన్ కొనసాగుతోందని ఏలూరు జిల్లా అటవీ అధికారి సందీప్ రెడ్డి తెలిపారు. ప్రజలకు అటవీ శాఖ సూచన: పులి సంచరిస్తున్న అటవీ ప్రాంతాలు, సమీప తోటలు, పొలాల వైపు ప్రజలు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలి. అటవీ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి

.