BREAKING
thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్ thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్
Test 4
Date of Publish : 18 November 2026, 09:07 pm
Posted by : K MAHESH

1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
18 Nov, 2026 - 09:07 PM
16 వీక్షణలు

అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

వలిగొండ, నవంబర్ 18 (ఎన్ టుడే న్యూస్): వలిగొండ మండలంలో నూతనంగా చేయూత పింఛన్లు మంజూరైన 1,105 మంది లబ్ధిదారులకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బుధవారం మంజూరు పత్రాలు అందజేశారు. మండలంలోని సాయి గణేష్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత అని, ఆ బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్వర్తిస్తోందని అన్నారు. పింఛన్ల కోసం అర్హులైన వారు నాయకుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని పేర్కొన్నారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

ప్రజల అవసరాలు, పేద కుటుంబాల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, భువనగిరి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తిని సహదేవ్, పట్టణ అధ్యక్షుడు పోలేపాక జానకిరాములు, పీఏసీఎస్ చైర్మన్ గరిసె రవి, స్థానిక సర్పంచ్ కుంభం వెంకట పాపిరెడ్డి, వేములకొండ శ్రీ మత్స్యగిరి దేవస్థానం చైర్మన్ తుమ్మల శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.