BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు
Test 4
Date of Publish : 19 November 2026, 04:57 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలంపై ఎస్ఈసీ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 04:57 AM
12 వీక్షణలు

రేపటి నుంచి ఎంపీటీసీల ఐదేళ్ల పదవీకాలం ప్రారంభం.. ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికకు ఏర్పాట్లు ఆంధ్రప్రదేశ్‌లో మండల, జిల్లా పరిషత్‌లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠా ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం, స్థానిక సంస్థల తొలి సమావేశాల తేదీలను ప్రకటించారు. ఈ ప్రకటన ప్రకారం నవంబర్ 19 నుంచి ఎంపీటీసీ సభ్యుల ఐదేళ్ల పదవీకాలం ప్రారంభం కానుంది. అదే రోజు మండల పరిషత్‌ల తొలి సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో ఎంపీపీ, ఉప ఎంపీపీల ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఇక నవంబర్ 20 నుంచి జడ్పీటీసీ సభ్యుల ఐదేళ్ల పదవీకాలం ప్రారంభం కానుంది. అదే రోజు జిల్లా పరిషత్‌ల తొలి సమావేశాలు నిర్వహించి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లను ఎన్నుకోనున్నారు. అలాగే కో-ఆప్టెడ్ సభ్యుల పదవీకాలం కూడా ఐదేళ్లుగా ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మండల, జిల్లా పరిషత్‌ల తొలి సమావేశాల నిర్వహణ తేదీలు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది

.