BREAKING
thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి
Date of Publish : 05 October 2026, 04:17 pm
Posted by : MOOLA RAJENDRA REDDY

నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
05 Oct, 2026 - 04:17 PM
2 వీక్షణలు

నంద్యాల: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి మరింత బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ సోమవారం నంద్యాల పట్టణంలోని పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పట్టణంలోని హోలీ క్రాస్ హైస్కూల్, ఖలీల్ సిద్దికి హైస్కూల్, సిద్దికి ఎయిడెడ్ ప్రైమరీ స్కూల్లను మంత్రి సందర్శించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, పాఠశాల నిర్వహణ తీరును పరిశీలించారు.

మౌలిక వసతుల పరిశీలన
ఉపాధ్యాయులతో చర్చ
విద్యార్థినికి సన్మానం

పాఠశాలల్లోని తరగతి గదులు, తాగునీటి సదుపాయం, పారిశుధ్యం తదితర మౌలిక వసతులను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు అందుతున్నాయా లేదా అనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో మంత్రి ఫరూక్ మాట్లాడారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం, రోజువారీ బోధనా కార్యక్రమాలు, పాఠశాల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఆరా తీశారు. విద్యార్థుల విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

తనిఖీ సందర్భంగా మంత్రి ఫరూక్ విద్యార్థులతో మాట్లాడి పలు ప్రశ్నలు అడిగారు. ఆయన అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానాలు ఇచ్చిన 10వ తరగతి విద్యార్థిని లక్ష్మీ ప్రసన్నను మంత్రి అభినందించి సన్మానించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు.