BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 07:54 pm
Posted by : SHAIK CHAND BASHA

ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
Shaik Chand Basha Pulivendula Constituency Reporter
19 Nov, 2026 - 07:54 PM
22 వీక్షణలు

వృద్ధులు, అనాథలు, దివ్యాంగ మహిళలకు చేయూత

అనంతపురం (ఎన్ టుడే న్యూస్): భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మాతృమూర్తి ఈశ్వరమ్మ 101వ జయంతిని పురస్కరించుకుని సత్యసాయి సేవా సమితి–2 అహోబిలపురం శాఖ ఆధ్వర్యంలో వృద్ధులు, నిరుపేదలు, దివ్యాంగ మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 101 చీరలను పంపిణీ చేశారు.

స్థానిక ముద్దనూరు రోడ్డులోని వికలాంగుల కమ్యూనిటీ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి కార్యవర్గ సభ్యులు సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మహిళా దివ్యాంగులకు చీరలు పంపిణీ చేశారు. తదుపరి అంధుల ఆశ్రమం, లీలావతి వృద్ధాశ్రమాల్లోని నిరాశ్రయ మహిళలకు చీరలు అందజేశారు.

ఈ సందర్భంగా సత్యసాయి సేవా సమితి జిల్లా సర్వీస్ కోఆర్డినేటర్, విశ్రాంత ఇంజనీర్ రమణ మాట్లాడుతూ.. భగవాన్ సత్యసాయిబాబాను చిన్నతనం నుంచే ఆధ్యాత్మికత, భక్తిభావం, సేవాతత్పరం వైపు నడిపించడంలో ఆయన మాతృమూర్తి ఈశ్వరమ్మ పాత్ర విశేషమని అన్నారు. సుమారు ఆరు దశాబ్దాల క్రితమే ఆమె పుట్టపర్తి గ్రామంలోని పిల్లలకు పాఠశాల, అనారోగ్యంతో బాధపడేవారికి వైద్యశాల, మహిళల ఇబ్బందులు తొలగించేందుకు తాగునీటి సౌకర్యం వంటి అంశాలను కోరారని గుర్తుచేశారు. అనంతర కాలంలో సత్యసాయిబాబా విద్యాసంస్థలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, అనంతపురం జిల్లా ప్రజలకు తాగునీటి సదుపాయం కల్పించి తల్లి కోరికలను నెరవేర్చారని పేర్కొన్నారు. ఈశ్వరమ్మ సేవా స్ఫూర్తి దివ్యాంగులకు, సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వికలాంగుల నెట్‌వర్క్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఇరికిరెడ్డి రఘునాథరెడ్డి, సత్యసాయి సేవా సమితి అహోబిలపురం శాఖ జిల్లా సేవా కోఆర్డినేటర్ రమణ, పులివెందుల కన్వీనర్ దాసరి రెడ్డయ్య, ఎస్‌ఎంఎం స్కూల్ ఫౌండర్ రవి కిషోర్ నాయుడు, విజయలక్ష్మి, సత్యసాయి సేవా సమితి కార్యవర్గ సభ్యులు రామమునిరెడ్డి, చెన్నారెడ్డి, పుల్లమ్మ, స్వరూప, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.