BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 10:06 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

నందనవనం నామినేషన్ కేంద్రానికి వెళ్తున్న దద్దాల నారాయణ యాదవ్‌ను అడ్డుకున్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / హనుమంతునిపాడు
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
19 Nov, 2026 - 10:06 PM
14 వీక్షణలు

నామినేషన్ల తిరస్కరణకు అధికారులు కుట్ర చేస్తున్నారంటూ వైసీపీ ఇన్‌చార్జ్ ఆరోపణ

కనిగిరి (ఎన్ టుడే న్యూస్): నందనవనం నామినేషన్ కేంద్రానికి బయలుదేరిన కనిగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌ను మార్గమధ్యంలోని వాళ్లచర్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ.. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు అన్ని విధాలా సక్రమంగా ఉన్నప్పటికీ, వాటిని తిరస్కరించాలనే ఉద్దేశంతో ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కూటమి నాయకులతో కుమ్మక్కై అర్ధరాత్రి వరకు కూడా వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

నందనవనం నామినేషన్ కేంద్రంలో హెచ్‌ఎం పాడు, కనిగిరి, వెలిగండ్ల ప్రాంతాలకు చెందిన కూటమి నాయకులతో కలిసి కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారానికి కనిగిరి సీఐ, హెచ్‌ఎం పాడు ఎస్‌ఐ, వెలిగండ్ల ఎస్‌ఐ సహకరిస్తూ, నామినేషన్ కేంద్రం వద్ద వారికి రక్షణ కల్పిస్తున్నారని విమర్శించారు.

ఎన్నికల, పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు దద్దాల నారాయణ యాదవ్ తెలిపారు.