BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 08:23 pm
Posted by : NUNE SRIKANTH

ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
19 Nov, 2026 - 08:23 PM
26 వీక్షణలు

ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో నవంబర్ 20న నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, సభల్లో పాల్గొనేందుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్కతో పాటు రాష్ట్ర మంత్రి సుదర్శన్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పర్యటించనున్నారు.

పర్యటన వివరాల ప్రకారం.. ఉదయం 11.30 గంటలకు పెర్కిట్ సమీపంలోని నిర్మల్ బైపాస్ రోడ్డు వద్ద అతిథులకు స్వాగతం పలుకుతారు. ఉదయం 11.45 గంటలకు పెర్కిట్‌లో ఆదివాసీ నాయక పోడ్ శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ చౌరస్తా వద్ద రూ.4 కోట్లతో ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్‌ను ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం 1.30 గంటలకు క్షత్రియ ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఆర్మూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు రూ.కోటి వ్యయంతో నిర్మించిన భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆర్మూర్ పట్టణంలో రూ.4 కోట్లతో మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసిన గుండ్ల చెరువును, మామిడిపల్లిలో రూ.1.43 కోట్లతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) భవనాన్ని ప్రారంభించనున్నారు.

ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.