BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 07:56 pm
Posted by : SHAIK CHAND BASHA

దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
Shaik Chand Basha Pulivendula Constituency Reporter
19 Nov, 2026 - 07:56 PM
20 వీక్షణలు

టీడీపీ కార్యకర్తలపై దాడులపై నిరసనగా ధర్నా.. నామినేషన్ల ప్రక్రియ ముగిశాక కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ హామీ

పులివెందుల (ఎన్ టుడే న్యూస్): పులివెందుల ప్రాంతంలో టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, అన్యాయాలపై నిరసనగా మూడు నుంచి నాలుగు గంటల పాటు ధర్నా నిర్వహించినట్లు టీడీపీ నేత బీటెక్ రవి తెలిపారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్‌ను కోరినట్లు వెల్లడించారు.

సింహాద్రిపురం మార్కెట్ కమిటీ చైర్మన్ బండి రామసురారెడ్డిపై దాడి జరిగిందని, ఈ ఘటనలో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అత్యవసర చికిత్స కోసం కడపకు తరలించామని బీటెక్ రవి పేర్కొన్నారు. చక్రాయపేట, అగడూరు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు వందలాది మందితో వచ్చి దాడులకు పాల్పడ్డాయని, పోలింగ్ స్టేషన్ చుట్టూ ట్రాక్టర్లతో బీభత్సం సృష్టించి తమ కార్యకర్తలను గాయపరిచాయని ఆరోపించారు.

గతంలో ఫైరింగ్ కేసుల్లో 307 సెక్షన్ కింద నిందితులుగా ఉన్నవారు బయట స్వేచ్ఛగా తిరుగుతూ గొడవలు సృష్టిస్తున్నా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎంపీ అవినాష్ రెడ్డితో కలిసి నిందితులు పోలీస్ స్టేషన్లకు వచ్చి పూచీకత్తులు ఇస్తున్నారని, ఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్నప్పటికీ స్థానిక పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని డీఐజీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

దీనిపై స్పందించిన కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్వయంగా వచ్చి, నామినేషన్ల ప్రక్రియ ముగిసిన వెంటనే అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బీటెక్ రవి వెల్లడించారు. కార్యకర్తలు ధైర్యంగా నామినేషన్లు దాఖలు చేసుకోవాలని, దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేసి న్యాయం చేస్తామని డీఐజీ భరోసా ఇచ్చారని తెలిపారు. దీంతో ధర్నా విరమిస్తున్నట్లు ప్రకటించారు.

నేర చరిత్ర ఉన్న వ్యక్తులపై ప్రత్యేకంగా ఫిర్యాదులు అందిస్తే వెంటనే చర్యలు ప్రారంభిస్తామని డీఐజీ కోయ ప్రవీణ్ స్పష్టం చేసినట్లు సమాచారం.