BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 07:57 pm
Posted by : K MAHESH

అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
19 Nov, 2026 - 07:57 PM
17 వీక్షణలు

నూతన పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీలో ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ గుండెబోయిన ఉషా అశోక్ యాదవ్

నెల్లికుదురు, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్): గత పదేళ్లుగా పెన్షన్లకు నోచుకోని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులకు నూతన చేయూత పెన్షన్లు మంజూరు చేసి ఆసరాగా నిలుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ గుండెబోయిన ఉషా అశోక్ యాదవ్ అన్నారు.

గురువారం నెల్లికుదురు మండలంలోని ఎర్రబెల్లిగూడెం గ్రామంలో ఇటీవల మంజూరైన నూతన చేయూత పెన్షన్ల పత్రాలను స్థానిక ఉపసర్పంచ్ జీలుకర సాంబమూర్తి, పాలకమండలి సభ్యులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తోందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీలేని రుణాలు, రైతులకు వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్, సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు, విత్తనాలు, ఎరువుల పంపిణీ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు.

స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీ నాయక్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, పోరిక బలరాం నాయక్ సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని, ఇందుకు పాలకమండలి సభ్యులతో పాటు గ్రామ ప్రజలందరూ సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజు, కారోబార్ బండారి రాములు, కాంగ్రెస్ నాయకులు బండారి మల్లయ్య, సొంటి రెడ్డి అశోక్ రెడ్డి, పల్లె యాకయ్య, గుండెబోయిన బాలకృష్ణ, గుండెబోయిన శ్రీశైలం, బీఆర్ఎస్ నాయకులు బత్తిని అనిల్ గౌడ్, పెరుమాండ్ల రాము గౌడ్, పల్లె వెంకట రాములు గౌడ్, బొమ్మెర అనిల్ గౌడ్, పాలకమండలి సభ్యులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.