BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 08:05 pm
Posted by : SHAIK CHAND BASHA

పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి....

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
Shaik Chand Basha Pulivendula Constituency Reporter
19 Nov, 2026 - 08:05 PM
26 వీక్షణలు

పులివెందుల: నియోజకవర్గంలోని తొండూరు మండలం అగడూరు గ్రామంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు పథకం ప్రకారం దాడులకు పాల్పడ్డారని పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి ఆరోపించారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ బండి రామసురారెడ్డి, తులసీనాథ్ రెడ్డిపై కారంపొడి చల్లి దాడి చేశారని, ఈ ఘటనలో మార్కెట్ యార్డ్ చైర్మన్ అపస్మారక స్థితికి చేరుకోవడంతో పరిస్థితి విషమించి కడప రిమ్స్‌కు తరలించారని తెలిపారు.

నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన మహిళలపైనా దాడి చేశారని, తమ వర్గానికి చెందిన నాలుగు నుంచి ఐదు వాహనాలను దగ్ధం చేశారని బీటెక్ రవి పేర్కొన్నారు. నామినేషన్ సందర్భంగా సుమారు 600 నుంచి 700 మంది బయటి వ్యక్తులు కారంపొడి, పెట్రోల్ బాంబులు, కర్రలు, రాళ్లు, రాడ్లతో దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. మార్కెట్ యార్డ్ చైర్మన్‌ను కాపాడే ప్రయత్నంలో తమకు కూడా గాయాలయ్యాయని, భయానక వాతావరణం సృష్టించి ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

అధికార పక్షంలో ఉన్నప్పటికీ ధర్నా చేయాల్సిన పరిస్థితి రావడానికి పోలీసుల ఉదాసీనతే కారణమని బీటెక్ రవి ఆరోపించారు. గతంలో 307 కేసుల్లో నిందితులుగా ఉన్నవారిపై ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరినా, ఎస్పీ నుంచి ఆదేశాలు లేవంటూ పోలీసులు అరెస్టులు చేయలేదని విమర్శించారు. గతంలో పోలీసు ఫైరింగ్‌కు సంబంధించిన కేసులో నిందితులను అరెస్టు చేయకపోవడం వల్లే వారికి ధైర్యం వచ్చిందని, తప్పుడు ఫిర్యాదులతో హైకోర్టును, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (SEC) తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

అగడూరు ఘటనలకు ఎంపీ అవినాష్ రెడ్డే పూర్తి బాధ్యత వహించాలని బీటెక్ రవి డిమాండ్ చేశారు. గతంలో 307 కేసులో ఉన్నవారితో పాటు ప్రస్తుతం తమ కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారందరినీ వెంటనే అరెస్టు చేయాలని కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు ధర్నా విరమించబోమని స్పష్టం చేశారు.