BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 10:08 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

టీడీపీని వీడి వైసీపీలో చేరిన సింగిల్ విండో డైరెక్టర్ ఉండేల పిచ్చిరెడ్డి సహా 20 కుటుంబాలు

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / పెదచెర్లోపల్లె
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
19 Nov, 2026 - 10:08 PM
14 వీక్షణలు

దద్దాల నారాయణ యాదవ్ సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకున్న నేతలు, అనుచరులు

పీసీపల్లి (ఎన్ టుడే న్యూస్): ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం చింతగుంపల్లి పంచాయతీ పరిధిలోని విఠలాపురంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సింగిల్ విండో డైరెక్టర్ ఉండేల పిచ్చిరెడ్డితో పాటు ఆయన అనుచరులు, సుమారు 20 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. బుధవారం రాత్రి కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ వారికి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన సమాధానం చెప్పాలని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, ప్రజా సంక్షేమానికి పార్టీ నాయకత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రానున్న రోజుల్లో పార్టీ మరింత బలోపేతం అయ్యేలా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు.

వైసీపీలో చేరిన వారిలో ఉండేల పిచ్చిరెడ్డి, భోగాల నరసింహం రెడ్డి, భోగాల మాలకొండారెడ్డి, తిరుమలపూడి మహేంద్ర, జొన్నవరపు మల్లికార్జున, ఉండేల నరసమ్మ, ఉండేల శ్రీదేవి, ఉండేల తిరుపాలురెడ్డితో పాటు పలువురు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో పీసీపల్లి మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.