BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 10:00 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

సింగరాయకొండ ఎంపీపీగా చీమకుర్తి కృష్ణ చైతన్య.. ఉపాధ్యక్షుడిగా మించల బ్రహ్మయ్య

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
19 Nov, 2026 - 10:00 PM
13 వీక్షణలు

ఎన్నికైన నూతన పాలకవర్గానికి కూటమి శ్రేణుల ఘన సత్కారం

సింగరాయకొండ, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్): సింగరాయకొండ మండల ప్రజా పరిషత్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం సాదాసీదాగా జరిగింది. మండల పరిషత్ అధ్యక్షుడిగా చీమకుర్తి కృష్ణ చైతన్య, ఉపాధ్యక్షుడిగా మించల బ్రహ్మయ్య ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలు ముగియడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మధ్యాహ్నం ఒంటి గంటకు మండల పరిషత్ సమావేశ మందిరంలో అధికారులు తొలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండ మండల ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికల్లో పాకలలో ఒక ఎంపీటీసీ స్థానం మినహా మిగిలిన అన్ని స్థానాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. తొలుత కోఆప్షన్ సభ్యుల ఎంపిక, ప్రమాణ స్వీకారానికి షెడ్యూల్ ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలో వాయిదా వేశారు.

మండల ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణ అధికారి సీహెచ్ సువార్త, మండల పరిషత్ అభివృద్ధి అధికారి దారా వెంకటరావు నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మెజారిటీ సభ్యుల ఆమోదంతో చీమకుర్తి కృష్ణ చైతన్యను ఎంపీపీగా, మించల బ్రహ్మయ్యను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అనంతరం వారిద్దరితో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమాన్ని మండల తహసీల్దార్ ఎన్.వి.బి. రాజేష్ పర్యవేక్షించారు.

ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అనుచరులు, సీనియర్ జర్నలిస్టులు నూతన ఎంపీపీ, ఉపాధ్యక్షులను అభినందించి ఘనంగా సత్కరించారు. ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.