ధర్మపురిలో ఘనంగా కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు
ధర్మపురి: ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ కేంద్ర మంత్రి, దివంగత నేత కాకా గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ.. పేదలు, బడుగు బలహీన వర్గాలు, కార్మికుల సంక్షేమం కోసం కాకా వెంకటస్వామి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన కృషి, విద్యాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయని పేర్కొన్నారు.
సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, కార్మికుల సంక్షేమం, విద్యా రంగం అభివృద్ధి కోసం కాక