BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 07:51 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రక్షణ శాఖ వాట్సాప్ గ్రూపుల్లో పాక్ గూఢచారుల చొరబాటు భారతీయ నంబర్లతో గ్రూపుల్లో చేరిక..

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 07:51 AM
11 వీక్షణలు

రహస్య సమాచారమే లక్ష్యంగా సైబర్ గూఢచర్యం అనుమానిత సభ్యులపై నిఘా.. కీలక సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దని అధికారుల హెచ్చరిక కేంద్ర రక్షణ శాఖకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో పాకిస్థాన్ గూఢచారులు చొరబడినట్లు భద్రతా సంస్థలు గుర్తించడం కలకలం రేపుతోంది. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రక్షణ శాఖకు చెందిన పౌర అధికారులు సభ్యులుగా ఉన్న వాట్సాప్ గ్రూపులను లక్ష్యంగా చేసుకుని పాక్ నిఘా సంస్థలకు చెందిన వ్యక్తులు రహస్య సమాచారాన్ని సేకరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారతీయ ఫోన్ నంబర్లను ఉపయోగిస్తూ 'సోనియా' వంటి పేర్లతో గ్రూపుల్లో సభ్యులుగా చేరినట్లు భద్రతా వర్గాలు గుర్తించినట్లు సమాచారం. సాధారణ సభ్యుల మాదిరిగా వ్యవహరిస్తూ గ్రూపుల్లో జరిగే సంభాషణలను పరిశీలించడం, కీలకమైన వివరాలను సేకరించడం ద్వారా గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన భద్రతా విభాగాల్లో తీవ్ర అప్రమత్తతకు దారితీసింది. ముఖ్యంగా రక్షణ శాఖకు సంబంధించిన విధులు, అధికారుల కదలికలు, కార్యాచరణ వివరాలు, అంతర్గత సమాచారాన్ని వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ గ్రూపుల్లో ఉన్న సభ్యుల ఫోన్ నంబర్లు, వ్యక్తిగత వివరాలు, వారి గుర్తింపును క్షుణ్ణంగా పరిశీలించాలని భద్రతా విభాగాలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని గూఢచర్య కార్యకలాపాలు సాగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని భద్రతా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దేశ రక్షణకు సంబంధించిన చిన్న సమాచారం కూడా శత్రు దేశాల చేతుల్లోకి వెళ్లకుండా అధికారులు, సిబ్బంది అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.