BREAKING
thumb ● తన ఓటు హక్కును వినియోగించుకున్న డా. బత్తల హరిప్రసాద్ thumb ● ఎమ్మెల్యే సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణ thumb ● స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దిరెడ్డి కుటుంబం thumb ● పుట్టపాకకు చేరుకున్న తీన్మార్ మల్లన్న పాదయాత్ర thumb ● నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కారుకు ప్రమాదం thumb ● అహ్మద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు రహీం షరీఫ్ thumb ● భారత్ బజార్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● ఆడపిల్ల వివాహానికి రూ.5,016 కానుక మాటనిలబెట్టుకున్న సర్పంచ్ కిషన్ నాయక్ thumb ● కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మర్యాదపూర్వక స్వాగతం thumb ● పోలింగ్ సరళిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి thumb ● తన ఓటు హక్కును వినియోగించుకున్న డా. బత్తల హరిప్రసాద్ thumb ● ఎమ్మెల్యే సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణ thumb ● స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దిరెడ్డి కుటుంబం thumb ● పుట్టపాకకు చేరుకున్న తీన్మార్ మల్లన్న పాదయాత్ర thumb ● నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కారుకు ప్రమాదం thumb ● అహ్మద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు రహీం షరీఫ్ thumb ● భారత్ బజార్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● ఆడపిల్ల వివాహానికి రూ.5,016 కానుక మాటనిలబెట్టుకున్న సర్పంచ్ కిషన్ నాయక్ thumb ● కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మర్యాదపూర్వక స్వాగతం thumb ● పోలింగ్ సరళిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి
Test 4
Date of Publish : 05 November 2026, 03:54 pm
Posted by : SEETHA KIRAN KUMAR

నేడు పారా అథ్లెట్లతో ప్రధాని మోదీ భేటీ

క్రీడలు క్రీడలు
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
05 Nov, 2026 - 03:54 PM
9 వీక్షణలు

ఆసియా పారా క్రీడల్లో పతక విజేతలకు అభినందనలు.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కార్యక్రమం

న్యూఢిల్లీ, నవంబర్ 05 (ఎన్ టుడే న్యూస్): ఆసియా పారా క్రీడలు-2026లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సమావేశం కానున్నారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా అథ్లెట్లను అభినందించడంతో పాటు సమావేశంలో ప్రధాని ప్రసంగించనున్నారు.

రికార్డు స్థాయిలో 114 పతకాలు

జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా అక్టోబర్‌ 18 నుంచి 24 వరకు జరిగిన ఆసియా పారా క్రీడల్లో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. భారత అథ్లెట్లు మొత్తం 114 పతకాలు సాధించారు. ఇందులో 30 స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ పతకాలతో భారత్‌ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.

క్రీడాకారులు, కోచ్‌లకు అభినందనలు

ఈ కార్యక్రమంలో పతక విజేతలైన అథ్లెట్లు, కోచ్‌లు, భారత పారాలింపిక్‌ కమిటీ, భారత ఒలింపిక్‌ సంఘం ప్రతినిధులు, జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులు, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొననున్నారు.