ఎమ్మెల్యే సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణ
మేయర్‌గా ఘన విజయం సాధించిన రాధాకృష్ణకు సుజనా చౌదరి, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి జి.వి. కృష్ణారావు అభినందనలు
విజయవాడ (ఎన్ టుడే న్యూస్): విజయవాడ మేయర్‌గా ఘన విజయం సాధించిన వంగవీటి రాధాకృష్ణ గురువారం కానూరులోని ఎమ్మెల్యే సుజనా చౌదరి క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి జి.వి. కృష్ణారావు వంగవీటి రాధాకృష్ణకు అభినందనలు తెలియజేసి, శుభాకాంక్షలు తెలిపారు. మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయనకు అభినందనలు అందజేశారు.
విజయవాడ అభివృద్ధికి కృషి చేయాలి
ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా విజయవాడ నగర అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆకాంక్షించారు. నగర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.