BREAKING
thumb ● తన ఓటు హక్కును వినియోగించుకున్న డా. బత్తల హరిప్రసాద్ thumb ● ఎమ్మెల్యే సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణ thumb ● స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దిరెడ్డి కుటుంబం thumb ● పుట్టపాకకు చేరుకున్న తీన్మార్ మల్లన్న పాదయాత్ర thumb ● నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కారుకు ప్రమాదం thumb ● అహ్మద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు రహీం షరీఫ్ thumb ● భారత్ బజార్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● ఆడపిల్ల వివాహానికి రూ.5,016 కానుక మాటనిలబెట్టుకున్న సర్పంచ్ కిషన్ నాయక్ thumb ● కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మర్యాదపూర్వక స్వాగతం thumb ● పోలింగ్ సరళిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి thumb ● తన ఓటు హక్కును వినియోగించుకున్న డా. బత్తల హరిప్రసాద్ thumb ● ఎమ్మెల్యే సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణ thumb ● స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దిరెడ్డి కుటుంబం thumb ● పుట్టపాకకు చేరుకున్న తీన్మార్ మల్లన్న పాదయాత్ర thumb ● నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కారుకు ప్రమాదం thumb ● అహ్మద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు రహీం షరీఫ్ thumb ● భారత్ బజార్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● ఆడపిల్ల వివాహానికి రూ.5,016 కానుక మాటనిలబెట్టుకున్న సర్పంచ్ కిషన్ నాయక్ thumb ● కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మర్యాదపూర్వక స్వాగతం thumb ● పోలింగ్ సరళిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి
Test 4
Date of Publish : 05 November 2026, 06:33 pm
Posted by : K MAHESH

భారత్ బజార్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
05 Nov, 2026 - 06:33 PM
37 వీక్షణలు

నిర్వాహకుడు ఎండీ వాజిద్‌కు శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్.. కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు

సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 05 (ఎన్ టుడే న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత్ బజార్‌ను గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ప్రారంభించారు. మండల కేంద్రంలోని చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వైపు వెళ్లే మార్గంలో నిర్వాహకుడు ఎండీ వాజిద్ ఈ బజార్‌ను ఏర్పాటు చేశారు.

నిర్వాహకులకు శుభాకాంక్షలు

నూతన భారత్ బజార్‌ను ప్రారంభించిన అనంతరం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి నిర్వాహకుడు ఎండీ వాజిద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు.

పలువురు ప్రముఖుల హాజరు

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ పల్లె మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కోన్‌రెడ్డి నర్సింహ, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బద్దుల మురళి యాదవ్, గుత్త వెంకటరెడ్డి, ఎండీ గౌస్ ఖురేషి, మాజీ వార్డు సభ్యులు ఎండీ ముస్తఫా ఖాన్, ఎండీ ఫయాజ్, గునిగంటి రాజు గౌడ్, ఉప్పల శ్రీనివాస్, బద్దుల యాదగిరి యాదవ్, గడ్డం యాదగిరి, ఎండీ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.