పోలింగ్ సరళిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి
చింతలపూడి, నవంబర్ 05: ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండలంలోని పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ తీరును పర్యవేక్షిస్తూ, పార్టీ తరఫున విధులు నిర్వహిస్తున్న పోలింగ్ ఏజెంట్లు, నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ సమన్వయంతో వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు..