సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
AISSEE 2027-28 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల.. డిసెంబర్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్, నవంబర్ 05 (ఎన్ టుడే న్యూస్): దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్స్‌లో 2027-28 విద్యా సంవత్సరానికి 6, 9వ తరగతుల్లో ప్రవేశాల కోసం ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (AISSEE) నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు.
ముఖ్యమైన తేదీలు ఇవే..
ప్రవేశాల కోసం విద్యార్థులు డిసెంబర్ 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో డిసెంబర్ 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే సవరించుకోవచ్చు.
జనవరి 31న ప్రవేశ పరీక్ష
2027 జనవరి 25వ తేదీ నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. జనవరి 31వ తేదీన దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. సైనిక్ స్కూల్స్‌లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.