BREAKING
thumb ● పోలింగ్ సరళిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి thumb ● సైనిక్‌ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం thumb ● Nalgonda: ఉపాధ్యాయులు లేకుండా శర్భాపురం ప్రాథమిక పాఠశాల thumb ● గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా ఉప్పలమ్మ పండుగ thumb ● ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 66 పోలింగ్ కేంద్రాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు thumb ● చదళ్ళ సమీపంలో ప్రధాన రహదారిపై ప్రమాదకర కాలువ.. ప్రయాణికుల ఆందోళన thumb ● మహా పాదయాత్రలో అయ్యప్ప స్వాములకు స్ఫూర్తి యోగ సభ్యుల సంఘీభావం thumb ● నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చకు అవకాశం thumb ● తెలంగాణ, ఏపీలో వర్ష సూచన.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక thumb ● పోలింగ్ సరళిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి thumb ● సైనిక్‌ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం thumb ● Nalgonda: ఉపాధ్యాయులు లేకుండా శర్భాపురం ప్రాథమిక పాఠశాల thumb ● గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా ఉప్పలమ్మ పండుగ thumb ● ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 66 పోలింగ్ కేంద్రాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు thumb ● చదళ్ళ సమీపంలో ప్రధాన రహదారిపై ప్రమాదకర కాలువ.. ప్రయాణికుల ఆందోళన thumb ● మహా పాదయాత్రలో అయ్యప్ప స్వాములకు స్ఫూర్తి యోగ సభ్యుల సంఘీభావం thumb ● నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చకు అవకాశం thumb ● తెలంగాణ, ఏపీలో వర్ష సూచన.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
Test 4
Date of Publish : 05 November 2026, 04:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వరదల్లో ప్రాణాలకు తెగించి సేవలందించిన సిబ్బందికి మంత్రి పొంగులేటి అభినందనలు

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Nov, 2026 - 04:31 PM
26 వీక్షణలు

మీ ధైర్యం.. సమయస్ఫూర్తి కి అభినందనలు అంటూ ప్రశంసలు

సొంత ఇల్లు లేని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ అన్ని శాఖల సమన్వయంతోనే ప్రాణనష్టం నివారించగలిగామని వెల్లడి ఖమ్మం జిల్లా, సత్తుపల్లి: మురసు తుపాను ప్రభావంతో బేతుపల్లి పెద్ద చెరువు అలుగు పొంగి వరద ఉద్ధృతి పెరిగిన సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సహాయక చర్యల్లో పాల్గొన్న ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ధైర్యసాహసాలు అభినందనీయమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణనష్టం జరగకుండా బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన అధికారుల సేవలు మరువలేనివని ప్రశంసించారు. బుధవారం రాత్రి బేతుపల్లి పెద్ద చెరువు వద్ద వరదలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించే క్రమంలో పడవ బోల్తాపడటంతో 11 మంది వరద ఉద్ధృతిలో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీతో పాటు వివిధ శాఖల అధికారులు అప్రమత్తమై సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమించి వరదలో చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఆసుపత్రిలో సిబ్బందికి మంత్రి పరామర్శ గురువారం సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న చాతకొండ ఆరో బెటాలియన్‌కు చెందిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు దివాకర టీఎస్, అంకిత్‌లతో కలిసి సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చాతకొండ ఆరో బెటాలియన్‌కు చెందిన ఆర్ఎస్ఐ మురళి, హెడ్ కానిస్టేబుల్ నరేష్, కానిస్టేబుళ్లు వేణు, బాలాజీ, సీతయ్య, కాశీరాంతో పాటు అగ్నిమాపక శాఖకు చెందిన ఎస్.కే. యాసిన్ అజ్వల్, ఎన్. రాజా, నాజర్ వలీ, రామిరెడ్డిలను పరామర్శించారు. రాత్రంతా వరద ఉద్ధృతిలో చిక్కుకున్నప్పటికీ ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్న వారి తెగువను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సిబ్బందికి శాలువాలు కప్పి సత్కరించి పండ్లు అందజేశారు. అధికారుల సమన్వయంతోనే సురక్షితంగా బయటకు బుధవారం రాత్రే ఈ ఘటనను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి తెలిపారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు కలెక్టర్లు, పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది సమష్టిగా పనిచేశారని ప్రశంసించారు. తొలుత ఉదయం హెలికాప్టర్ ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని భావించినప్పటికీ, అధికారుల సమర్థవంతమైన చర్యలతో ఆ అవసరం లేకుండానే అందరినీ ఒడ్డుకు చేర్చగలిగారని వెల్లడించారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో తాను సైతం వరదలో చిక్కుకున్న వారితో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పినట్లు మంత్రి గుర్తుచేశారు. విధి నిర్వహణలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి ఇందిరమ్మ ఇళ్ల హామీ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిలో సొంత ఇళ్లు లేని వారు ఎవరైనా ఉంటే, వారు ఏ జిల్లాకు చెందిన వారైనా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. ఆపత్కాలంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడిన ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బందితో పాటు సహాయక చర్యల్లో భాగస్వాములైన కలెక్టర్లు, పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారులకు వ్యక్తిగతంగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.