BREAKING
thumb ● పోలింగ్ సరళిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి thumb ● సైనిక్‌ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం thumb ● Nalgonda: ఉపాధ్యాయులు లేకుండా శర్భాపురం ప్రాథమిక పాఠశాల thumb ● గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా ఉప్పలమ్మ పండుగ thumb ● ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 66 పోలింగ్ కేంద్రాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు thumb ● చదళ్ళ సమీపంలో ప్రధాన రహదారిపై ప్రమాదకర కాలువ.. ప్రయాణికుల ఆందోళన thumb ● మహా పాదయాత్రలో అయ్యప్ప స్వాములకు స్ఫూర్తి యోగ సభ్యుల సంఘీభావం thumb ● నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చకు అవకాశం thumb ● తెలంగాణ, ఏపీలో వర్ష సూచన.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక thumb ● పోలింగ్ సరళిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి thumb ● సైనిక్‌ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం thumb ● Nalgonda: ఉపాధ్యాయులు లేకుండా శర్భాపురం ప్రాథమిక పాఠశాల thumb ● గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా ఉప్పలమ్మ పండుగ thumb ● ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 66 పోలింగ్ కేంద్రాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు thumb ● చదళ్ళ సమీపంలో ప్రధాన రహదారిపై ప్రమాదకర కాలువ.. ప్రయాణికుల ఆందోళన thumb ● మహా పాదయాత్రలో అయ్యప్ప స్వాములకు స్ఫూర్తి యోగ సభ్యుల సంఘీభావం thumb ● నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చకు అవకాశం thumb ● తెలంగాణ, ఏపీలో వర్ష సూచన.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
Test 4
Date of Publish : 05 November 2026, 04:02 pm
Posted by : SEETHA KIRAN KUMAR

తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్‌కు ఆహ్వానం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
05 Nov, 2026 - 04:02 PM
11 వీక్షణలు

18 రంగాల్లో సమస్యలకు పరిష్కారాలు చూపండి.. విజేతలకు ప్రభుత్వ కాంట్రాక్టులు

హైదరాబాద్, నవంబర్ 05 (ఎన్ టుడే న్యూస్): రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలకు వినూత్న పరిష్కారాలు కనుగొనే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎనర్జీ, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పట్టణ మౌలిక సదుపాయాలు తదితర రంగాల్లో గుర్తించిన 18 సమస్యలకు పరిష్కారాలు అందించాలని స్టార్టప్‌లు, ఫౌండర్లు, ఆవిష్కర్తలకు పిలుపునిచ్చింది.

తక్కువ ఖర్చుతో ఆచరణ సాధ్యమైన పరిష్కారాలకు ప్రాధాన్యం

ప్రజల దైనందిన జీవితాల్లో సానుకూల మార్పు తీసుకొచ్చేలా ఆచరణ సాధ్యమైన, తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో అమలు చేయగల సాంకేతిక పరిష్కారాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

విజేతలకు ప్రభుత్వ కాంట్రాక్టులు

తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్ (TISC)లో విజేతలుగా నిలిచిన స్టార్టప్‌లు, ఆవిష్కర్తలకు తమ పరిష్కారాలను ప్రభుత్వ రంగంలో అమలు చేసేందుకు కాంట్రాక్టులు అందించనున్నారు. తద్వారా కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభించడంతో పాటు ప్రజా సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

స్టార్టప్‌లు, ఆవిష్కర్తలకు అవకాశం

ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాలనుకునే ఆసక్తి గల స్టార్టప్‌లు, ఫౌండర్లు, ఆవిష్కర్తలు అర్హతలు, పోటీ నిబంధనలు, దరఖాస్తు విధానం, చివరి తేదీ తదితర పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.