మాజీ జెడ్పీటీసీ బొల్లం అజయ్ ఆత్మహత్య
తెలంగాణ
/
జనగామ
ప్రైవేట్ పాఠశాల ఆవరణలో ఉరివేసుకుని బలవన్మరణం.. కారణాలు తెలియాల్సి ఉంది
జనగాం, నవంబర్ 05 (ఎన్ టుడే న్యూస్): జనగాం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రఘునాథపల్లి మండలానికి చెందిన మాజీ జెడ్పీటీసీ, బీఆర్ఎస్ నాయకుడు బొల్లం అజయ్ (మణికంఠ) ఆత్మహత్యకు పాల్పడ్డారు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఆవరణలో ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
కారణాలపై కొనసాగుతున్న ఆరా
బొల్లం అజయ్ మృతితో స్థానికంగా విషాదం నెలకొంది. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేపట్టి కారణాలను వెల్లడించాల్సి ఉంది.