BREAKING
thumb ● తన ఓటు హక్కును వినియోగించుకున్న డా. బత్తల హరిప్రసాద్ thumb ● ఎమ్మెల్యే సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణ thumb ● స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దిరెడ్డి కుటుంబం thumb ● పుట్టపాకకు చేరుకున్న తీన్మార్ మల్లన్న పాదయాత్ర thumb ● నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కారుకు ప్రమాదం thumb ● అహ్మద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు రహీం షరీఫ్ thumb ● భారత్ బజార్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● ఆడపిల్ల వివాహానికి రూ.5,016 కానుక మాటనిలబెట్టుకున్న సర్పంచ్ కిషన్ నాయక్ thumb ● కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మర్యాదపూర్వక స్వాగతం thumb ● పోలింగ్ సరళిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి thumb ● తన ఓటు హక్కును వినియోగించుకున్న డా. బత్తల హరిప్రసాద్ thumb ● ఎమ్మెల్యే సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణ thumb ● స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దిరెడ్డి కుటుంబం thumb ● పుట్టపాకకు చేరుకున్న తీన్మార్ మల్లన్న పాదయాత్ర thumb ● నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కారుకు ప్రమాదం thumb ● అహ్మద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు రహీం షరీఫ్ thumb ● భారత్ బజార్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● ఆడపిల్ల వివాహానికి రూ.5,016 కానుక మాటనిలబెట్టుకున్న సర్పంచ్ కిషన్ నాయక్ thumb ● కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మర్యాదపూర్వక స్వాగతం thumb ● పోలింగ్ సరళిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి
Test 4
Date of Publish : 05 November 2026, 04:01 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను హత్య చేసిన భర్త

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
05 Nov, 2026 - 04:01 PM
18 వీక్షణలు

భూమి విషయంలో తరచూ గొడవలు.. భార్యను చంపినట్లు అర్ధరాత్రి మామకు ఫోన్‌ చేసి చెప్పిన నిందితుడు

నవంబర్ 05 (ఎన్ టుడే న్యూస్): పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను భర్త హత్య చేసినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న మనస్పర్థలు, భూమి విషయంలో తలెత్తిన వివాదాలే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. భార్యను హత్య చేసిన అనంతరం నిందితుడు ఇంటికి తాళం వేసి పరారైనట్లు సమాచారం.

భూమి విషయంలో తరచూ గొడవలు

సందీప్ వర్మ, రీమా వర్మ (30) పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఎనిమిదేళ్ల కుమార్తె ఉంది. అయితే కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు కొనసాగుతున్నాయి. భూమికి సంబంధించిన విషయంపై కూడా తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.

భార్యను హత్య చేసి పరారీ

ఈ క్రమంలో మంగళవారం సందీప్ వర్మ తన భార్య రీమాపై దాడి చేసి తీవ్రంగా కొట్టిన అనంతరం గొంతు నులిమి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఇంటికి బయట నుంచి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

అర్ధరాత్రి మామకు ఫోన్‌

అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో సందీప్ తన మామ ధర్మేశ్‌కు ఫోన్ చేసి, తన కుమార్తెను హత్య చేసినట్లు చెప్పినట్లు సమాచారం. దీంతో బుధవారం తెల్లవారుజామున ధర్మేశ్ ఇంటికి వెళ్లి చూడగా తలుపుకు తాళం వేసి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

తాళం పగలగొట్టి చూడగా మృతదేహం

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అక్కడ రీమా వర్మ మృతదేహాన్ని గుర్తించారు. ధర్మేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న సందీప్ వర్మ కోసం గాలింపు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.