BREAKING
thumb ● పోలింగ్ సరళిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి thumb ● సైనిక్‌ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం thumb ● Nalgonda: ఉపాధ్యాయులు లేకుండా శర్భాపురం ప్రాథమిక పాఠశాల thumb ● గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా ఉప్పలమ్మ పండుగ thumb ● ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 66 పోలింగ్ కేంద్రాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు thumb ● చదళ్ళ సమీపంలో ప్రధాన రహదారిపై ప్రమాదకర కాలువ.. ప్రయాణికుల ఆందోళన thumb ● మహా పాదయాత్రలో అయ్యప్ప స్వాములకు స్ఫూర్తి యోగ సభ్యుల సంఘీభావం thumb ● నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చకు అవకాశం thumb ● తెలంగాణ, ఏపీలో వర్ష సూచన.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక thumb ● పోలింగ్ సరళిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి thumb ● సైనిక్‌ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం thumb ● Nalgonda: ఉపాధ్యాయులు లేకుండా శర్భాపురం ప్రాథమిక పాఠశాల thumb ● గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా ఉప్పలమ్మ పండుగ thumb ● ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 66 పోలింగ్ కేంద్రాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు thumb ● చదళ్ళ సమీపంలో ప్రధాన రహదారిపై ప్రమాదకర కాలువ.. ప్రయాణికుల ఆందోళన thumb ● మహా పాదయాత్రలో అయ్యప్ప స్వాములకు స్ఫూర్తి యోగ సభ్యుల సంఘీభావం thumb ● నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చకు అవకాశం thumb ● తెలంగాణ, ఏపీలో వర్ష సూచన.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
Test 4
Date of Publish : 05 November 2026, 03:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వరద ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పర్యటన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Nov, 2026 - 03:46 PM
27 వీక్షణలు

 శివపురంలో వరద బాధితులకు పరామర్శ.. సహాయక శిబిరాన్ని సందర్శించి భరోసా చింతలపూడి, నవంబర్ 5: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తమ్మిలేరు వరద ఉధృతి పెరగడంతో ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని శివపురం గ్రామం వరద ముంపునకు గురైంది. ఈ నేపథ్యంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ గురువారం వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. వరద ఉధృతికి నేలకూలిన ఇళ్లను, నీట మునిగిన ప్రాంతాలను స్వయంగా పరిశీలించి నష్టపోయిన కుటుంబాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తుఫాన్ సహాయక శిబిరాన్ని సందర్శించి అక్కడ ఆశ్రయం పొందుతున్న వరద బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం ద్వారా అందుతున్న సహాయక చర్యలు, ఆహారం, వసతి తదితర సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరినీ ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వరద పరిస్థితులపై అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయక, పునరావాస కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులకు సూచించారు.