BREAKING
thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● గ్రామ అభివృద్ధి కోసం 371 గజాల సొంత స్థలం విరాళం thumb ● బతలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.55 లక్షలతో సీసీ రోడ్లు thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● గ్రామ అభివృద్ధి కోసం 371 గజాల సొంత స్థలం విరాళం thumb ● బతలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.55 లక్షలతో సీసీ రోడ్లు thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
Date of Publish : 13 October 2026, 09:53 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
13 Oct, 2026 - 09:53 PM
9 వీక్షణలు

విజయవాడ, అక్టోబర్ 13: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం (అక్టోబర్ 14) ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకోనున్న నేపథ్యంలో ఆలయ అధికారులు భద్రతా పరమైన మార్పులు ప్రకటించారు. కొండపై వాహనాల రాకపోకలు, ప్రోటోకాల్ దర్శనాల వేళల్లో మార్పులు చేసినట్లు ఆలయ పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ తెలిపారు.

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 1 గంట నుంచి కొండపైకి అన్ని రకాల వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. మధ్యాహ్నం నుంచి ప్రోటోకాల్ దర్శనాలను అనుమతించరు. రాత్రి 7.45 గంటలకు కేటాయించిన ప్రోటోకాల్ దర్శన స్లాట్‌ను కూడా రద్దు చేశారు.

సాధారణంగా ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ఉండే ప్రోటోకాల్ దర్శన సమయాన్ని ఉదయం 9 గంటల వరకు పొడిగించారు. సాయంత్రం వేళలకు ప్రోటోకాల్ దర్శన టికెట్లు లేదా అనుమతులు పొందిన ప్రముఖులు, అధికారులు ఈ మార్పును గమనించి ఉదయం 6 నుంచి 9 గంటల మధ్యే అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.

రాష్ట్రపతి పర్యటన సందర్భంగా చేపట్టిన భద్రతా ఏర్పాట్లకు ప్రోటోకాల్ ప్రముఖులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు సహకరించాలని చైర్మన్, ఈవో విజ్ఞప్తి చేశారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.