BREAKING
thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 04:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రమణక్కపేట రైతుల ఆందోళన.. సాగు భూములకు పట్టాలు ఇస్తేనే ఓట్లు!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Nov, 2026 - 04:52 PM
80 వీక్షణలు

500 ఎకరాలకు పైగా భూములపై మూడు తరాలుగా సాగు.. హక్కులు లేక ప్రభుత్వ పథకాలకు దూరం ఎన్నికల సమయంలోనే గుర్తొస్తున్న రైతులు.. ఈసారి హామీ కాదు, పట్టాలే కావాలంటున్న సాగుదారులు

రమణక్కపేట, నవంబర్ 27: మా సాగు భూములకు పట్టాలు మంజూరు చేసిన వారికే మా ఓట్లు వేస్తామని ఏలూరు జిల్లా నూజివీడు డివిజన్ ముసునూరు మండలం రమణక్కపేట గ్రామానికి చెందిన సాగు రైతులు స్పష్టం చేశారు. మూడు తరాలుగా సాగు చేసుకుంటూ వస్తున్న వందలాది ఎకరాల భూములకు నేటికీ హక్కులు కల్పించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలోని రీ సర్వే నంబర్లు 1, 2, 3, 4/33, 266/2 పరిధిలో సుమారు 500 ఎకరాలకు పైగా భూములను రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్నారు. మామిడి, మొక్కజొన్న, జీడిమామిడి, నిమ్మ, మినుము, కంది, డ్రాగన్ ఫ్రూట్ తదితర పంటలను పండిస్తూ భూములకు సంబంధించిన పన్నులు సైతం చెల్లిస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ తమ భూములకు హక్కులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పలుమార్లు సంబంధిత రెవెన్యూ, పంచాయతీ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఇప్పటివరకు సమస్యకు పరిష్కారం లభించలేదని వాపోయారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోయినప్పుడు అందాల్సిన పెట్టుబడి రాయితీ, రైతు భరోసా తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు భూములపై హక్కులు లేకపోవడంతో తమకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి సాగు చేస్తున్న రైతులకు హక్కులు కల్పించాలని కోరుతూ అనేకసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ నాయకులు తమ వద్దకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని, కానీ తమ సమస్యను మాత్రం పరిష్కరించడం లేదని విమర్శించారు. ఈసారి మాత్రం మాటలతో సరిపెట్టే పరిస్థితి లేదని, పంచాయతీ తీర్మానం చేసి సాగు భూములకు పట్టాలు మంజూరు చేయిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చే వారికే ఓట్లు వేస్తామని రైతులు తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వేముల బక్కయ్య మాట్లాడుతూ రమణక్కపేట రైతులు సాగు చేస్తున్న భూములు అటవీ రికార్డుల్లో లేనప్పటికీ, భూముల స్థితిగతులు అటవీ భూములుగా నమోదై ఉండటంతో హక్కుల కల్పనలో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. జాయింట్ కలెక్టర్ జోక్యం చేసుకుని క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి సర్వే నిర్వహించి అర్హులైన రైతులకు పట్టాలు మంజూరు చేయాలని పలుమార్లు కోరినప్పటికీ ఇప్పటివరకు పరిశీలన జరగలేదన్నారు. కనీసం సాగు రికార్డుల్లోనైనా రైతుల వివరాలు నమోదు చేయాలని మంత్రి కొలుసు పార్థసారథిని కోరినట్లు తెలిపారు. మంత్రి గెలిచిన అనంతరం రమణక్కపేట గ్రామసభలో కూడా రైతుల తరఫున వినతిపత్రాలు అందజేసినా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. పంచాయతీ అధికారులకు సైతం సమావేశంలో తీర్మానం చేయాలని పలుమార్లు అర్జీలు సమర్పించినా స్పందన లేదని పేర్కొన్నారు. రైతుల దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించి, సాగు భూములకు పట్టాలు మంజూరు చేయించే విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. మూడు తరాలుగా భూములను నమ్ముకుని వ్యవసాయం చేస్తున్న రైతులకు భూ హక్కులు కల్పించకుండా ప్రభుత్వ పథకాలు అందకపోవడం అన్యాయమని రైతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆముదాల చిన్నబాబు, వేముల చంటి, ధారా బేబీశాలిని, నందిపాము రాణి, నందిపాము కుమారి, నందిపాము చిట్టెమ్మ, ఉయ్యూరు విజయలక్ష్మి, ఉప్పే రాంబాబు, ఉప్పే శివ, ఉప్పే శ్రీనివాసరావు, నాగం వెంకటేశ్వరరావు, తోట కొండలరావు, బోనాల సుబ్బారావు తదితర సాగు రైతులు పాల్గొన్నారు.