www.ntodaynews.com
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ
ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
NTODAY NEWS: ధర్మపురి
ధర్మపురి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలాలు ప్రతి పేదవాడికి అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ముఖ్యాంశాలు:
నియోజకవర్గ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు
స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు
స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#RepublicDay
#77thRepublicDay
#Dharampuri
#NationalFlag
#IndianConstitution
#Democracy
#NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube