BREAKING
విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​
Date of Publish : 21 April 2026, 01:26 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండలో నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Apr, 2026 - 01:26 PM
147 వీక్షణలు

చనుబండలో నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు

ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాస రావు ప్రశంసించారు. స్వర్ణాంధ్ర స్వాప్నికుడు, నిత్య కృషీలతో ప్రజల హృదయాలను గెలుచుకున్న తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ లోని తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించగా, మోరంపూడి శ్రీనివాస రావు, బొంతు సతీష్ లు అతిథులుగా పాల్గొన్నారు.

చనుబండ బీ సీ కాలనీలో జరిగిన ఈ వేడుకలు, కేక్ కటింగ్, మిఠాయిలు పంచడం, "జై బాబు, జైజై బాబు" అనే నినాదాలతో యువత హోరెత్తించడం, కేరింతలు కొట్టడం వంటి కార్యక్రమాలతో ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా మోరంపూడి శ్రీనివాస రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ ను స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా అభివృద్ధి చేయడానికి అనేక ప్రణాళికలు రచించి వాటిని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే, తెలుగు దేశం పార్టీని బలోపేతం చేయడం, మళ్లీ కూటమి ప్రభుత్వాన్ని అధికారం లోకి తీసుకురావడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఇది మనం చంద్ర బాబుకు ఇచ్చే కానుక అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో మిద్దె అఖిల్, భారత సురేష్, కంటే చెన్నా, నరసింహా, సిశాంత్, షేక్ రియాజ్, గత్తం సన్నీ, మిద్దె నాగేశ్వర రావు, చిల్లపల్లి చెన్నారావు, షేక్ బాబా, అరవింద్ తదితర తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.