పోలవరంలో మెగా పీటీఎం–4.0 కార్యక్రమంలో విశిష్ట అతిథుల సందడి
నూజివీడు డివిజన్ రిపోర్టర్ అమెర్ల ధర్మా రావు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో మెగా పీటీఎం–4.0 కార్యక్రమానికి గ్రామ ప్రజాప్రతినిధులు, విద్యా కమిటీ సభ్యులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కార్యక్రమంలో మరిడి చిన్న వెంకటేశ్వరరావు (చిట్టిబాబు), పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పింగుల రామకృష్ణ, జనసేన నాయకులు చిలుకూరి నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు బిలుగుది జయరాజు, గ్రామ ప్రముఖులు పజ్జురి మాధవరావు, విజయరాజు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాజీ చైర్మన్, ప్రధానోపాధ్యాయుడు ఆర్. నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పరసా శ్రీనివాసరావు, కారుమంచి దేవి, జక్కం రాజేష్, మలమంటి సిరి, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పరుశురాం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
అతిథులు విద్యార్థుల విద్యాభివృద్ధి, తల్లిదండ్రుల భాగస్వామ్యం, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై తమ అభిప్రాయాలను పంచుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.