BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 20 April 2026, 08:50 pm
Posted by : కూనురు మధు

65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్

తెలంగాణ
20 Apr, 2026 - 08:50 PM
253 వీక్షణలు

65 ​జాతీయ రహదారిపై 'డీజిల్ నో స్టాక్  NTODAY NEWS 

ఉమ్మడి నల్గొండ జిల్లా గుండా వెళ్లే విజయవాడ-హైదరాబాద్ 65వ నంబర్ జాతీయ రహదారిపై ఇంధన కష్టాలు మొదలయ్యాయి. గత మూడు  రోజులుగా  పెట్రోల్ బంకుల్లో "డీజిల్ లేదు" అనే మాటలు వినిపిస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ కీలక రహదారిపై డీజిల్ దొరక్కపోవడం రవాణా రంగాన్ని కుదిపేస్తోంది. సాధారణ ప్రయాణికులే కాకుండా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను తీసుకెళ్లే అంబులెన్స్‌లు, ఇతర అత్యవసర సేవలందించే వాహనాలకు కూడా డీజిల్ లభించని పరిస్థితి నెలకొంది. బంకుల వద్దకు వెళ్తే.. స్టాక్ లేదని నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. దీంతో గమ్యస్థానాలకు చిరాశిన వాహనాలు మధ్యలోనే ఆగిపోయాయి.

* ​బంక్ నిర్వాహకుల కథనం ప్రకారం..

గత కొద్ది రోజులుగా చమురు కంపెనీల నుండి సక్రమంగా లోడ్లు రావడం లేదని,
​బుకింగ్స్ క్యాన్సిలేషన్: డీజిల్ కోసం నగదు చెల్లించి బుక్ చేసుకున్నా, సరఫరా కేంద్రాల వద్ద లోడ్లు క్యాన్సిల్ అవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

* డీజిల్ కి ​పెరిగిన డిమాండ్:

మార్చి-ఏప్రిల్ నెలల్లో సాధారణంగానే డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, దానికి తగ్గట్టుగా సరఫరా లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది.
​ఆర్ధిక భారం: అడ్వాన్స్ పేమెంట్లు చేసినా స్టాక్ రాకపోవడంతో బంకుల నిర్వహణ భారంగా మారిందని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో 'నో స్టాక్' బోర్డులు పెడుతున్నామని యాజమాన్యాలు చెబుతున్నాయి.

* ​ప్రభుత్వం స్పందించాలి

​ప్రభుత్వ యంత్రాంగం మరియు పౌర సరఫరాల శాఖ అధికారులు ఈ విషయంపై వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, చమురు కంపెనీలతో చర్చించి తక్షణమే డీజిల్ సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. లేనిపక్షంలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.