BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 21 July 2026, 07:44 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రేవంత్ పాలనలో కరువు పరిస్థితులు: జగదీష్ రెడ్డి విమర్శలు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jul, 2026 - 07:44 AM
121 వీక్షణలు

రేవంత్ పాలనలో కరువు పరిస్థితులు: జగదీష్ రెడ్డి విమర్శలు

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కరువును ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆరోపించారు.

ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించడం లేదని ఆయన అన్నారు. మరో 15 రోజుల్లో రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకునే దూరదృష్టి ప్రభుత్వానికి లేదని విమర్శించారు.

వ్యవసాయం, తాగునీటి అవసరాల కోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో ప్రభుత్వం విఫలమైందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.