BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 September 2026, 05:50 pm
Posted by : LAKKA RAJASEKHAR

పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
04 Sep, 2026 - 05:50 PM
4 వీక్షణలు

మేడికొండూరు: పేరేచర్ల జంక్షన్‌లో మేడికొండూరు పోలీసులు గురువారం సాయంత్రం ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు వాహనాలను తనిఖీ చేసి, వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

ట్రిపుల్ రైడింగ్, అతివేగం, సైలెన్సర్ లేకుండా వాహనాలు నడపడం వంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. రహదారులపై నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల ముప్పు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సీఐ మధుసూదన్ రావు సూచించారు. వాహనదారులు హెల్మెట్ ధరించడం, వేగ నియంత్రణ పాటించడం, వాహనానికి సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచించారు.