బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
గుంటూరు: మేడికొండూరు మండలంలోని ఓ గ్రామంలో బాలికపై అత్యాచారం జరిగిన ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన గత నెల 31న రాత్రి జరిగినట్లు సమాచారం.
బాలిక ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో నలుగురు బాలురు అక్కడికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వారిలో ముగ్గురు బయట కాపలాగా ఉండగా, మరో బాలుడు బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటన అనంతరం తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక వాషింగ్ మిషన్‌కు సంబంధించిన ద్రావకాన్ని తాగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు విచారిస్తున్నారు.