BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 September 2026, 04:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గంపలగూడెం: నేత్రదానం.. మానవత్వానికి మహోన్నత సేవ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Sep, 2026 - 04:23 PM
14 వీక్షణలు

గంపలగూడెం, సెప్టెంబర్ 4: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం గ్రామానికి చెందిన యడ్ల వెంకాయమ్మ (72) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆమె మరణానంతరం కుటుంబ సభ్యులు చూపిన మానవత్వం అభినందనీయంగా నిలిచింది.

లయన్స్ క్లబ్ ప్రతినిధి, న్యాయవాది గోగిరెడ్డి కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను సంప్రదించి నేత్రదానం చేయాలని కోరారు. దీనికి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ, విజయవాడ వైద్య బృందం సాంకేతిక పరిజ్ఞానంతో మృతురాలి కార్నియాలను సేకరించింది. నేత్రదానం ద్వారా చూపు కోల్పోయిన వారికి వెలుగును అందించే అవకాశం ఉండటంతో కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయంపై పలువురు ప్రశంసలు వ్యక్తం చేశారు.

ఈ నేత్రదాన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు నాగిరెడ్డి, సుధాకర్ రెడ్డి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మృతురాలు వెంకాయమ్మకు భర్త యడ్ల వెంకటేశ్వరరావుతో పాటు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు చేసిన నేత్రదానం మరికొందరికి స్ఫూర్తిగా నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు.